ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా
18-04-2026 11:20 AM
తిరుపతి: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌పై( Prakash Raj) పరువు నష్టం దావా దాఖలైంది. టీటీడీ(Tirumala Tirupati Devasthanams) బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ప్రకాష్ రాజ్‌పై పరువు నష్టం దావా వేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేశారని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. ప్రకాశ్ రాజ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. వారంలో క్షమాపణ చెప్పకపోతే రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. బహిరంగ వేదికపై వి ద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని నోటీసులో వెల్లడించారు. ఇటీవల కేరళలో జరిగిన కార్యక్రమంలో సీతారామ లక్ష్మణులపై ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.






