17 May, 2026 | 3:34 AM

తైవాన్‌పై ట్రంప్ యూటర్న్

17-05-2026 12:22 AM
  1. వారి స్వాతంత్య్రం కోసం మేం పోరాడబోం
  2. చైనా అతిపెద్ద, శక్తిమంతమైన దేశం
  3. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్, మే 16: తైవాన్ అంశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. తైవాన్ స్వాతంత్య్రానికి మేం పోరాడబోమని, ఆ ద్వీపం అమెరికాకు 15వేల కి.మీ దూరంలో ఉందన్నారు. ఈ అంశం తమకు క్లిష్టమైన కష్టమైన సమస్యేనని చెప్పారు. చైనాలో తన మూడు రోజుల పర్యటన అనంతరం, తైవాన్‌కు భారీ ఆయుధ ప్యాకేజీపై ముందుకు వెళ్లాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ అన్నారు.

ఓ వార్తా సంస్థతో ట్రంప్ మాట్లాడుతూ.. తైవాన్ అంశం క్లిష్టమైన సమస్యేనని, ఈ దీపం చైనాకు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉందని, అదే అమెరికాకు మాత్రం 15వేల కిలీమీటర్లకు పైగా దూరంలో ఉందన్నారు. ఎక్కువ దూరం ఉండడంతో తాము వేగంగా స్పందించడం కష్టమే నని, చైనా చాలా శక్తివంతమైన, పెద్ద దేశం కూడా అన్నారు. ఉద్రిక్తితల విషయంలో చైనా, తైవాన్ సంయమనం పాటించాలన్నారు. వారి స్వాతంత్య్ర ఆకాంక్షల కోసం అంతదూరం ప్రయాణించి మేం యుద్ధం చేయాలని అనుకోవడం లేదన్నారు.

తైవాన్ సమస్యను పకడ్బందీగా పరిష్కరించకపోతే అమెరికా మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని ట్రంప్‌నకు జిన్‌పింగ్ స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తైవాన్ విషయంలో చైనా ఏకపక్ష చర్యలకు దిగొద్దు అని ఇంతకాలం అమెరికా స్పష్టం చేస్తూ వచ్చింది. దీనికి భిన్నంగా ఇప్పుడు ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. తైవాన్‌కు ఆయుధాలు విక్రయించాలా వద్దా అనే అంవంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా ట్రంప్ వెల్లడించారు.