60 గజాల ఇళ్ల స్థలాల పోరాటానికి టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు
30-06-2026 12:01 AM
- ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది..
- నేడు అదే ప్రభుత్వం వాటిని లాక్కుంటోంది
మొయినాబాద్ జూన్ 29(విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్లో 60 గజాల ఇళ్ల స్థలాల కోసం యువజన సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ సభాధ్యక్షులు కట్టమీద శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు షేక్ మహ్మద్ నూర్ భాయ్, నాగేష్, ఏనుగుల సంజీవరెడ్డి, బొక్క సురేందర్ రెడ్డి, ప్రవీణ్, బొక్క రవీందర్ రెడ్డి, కావాలి శ్రీనివాస్ ముదిరాజ్, దర్శన్ గౌడ్, యండి యూనుస్, బోనాల ప్రభాకర్, గాండ్ల సంతోష్ కుమార్, యువజన సంఘాల నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.






