29 April, 2026 | 7:12 PM

ఎస్ఎస్సి ఫలితాల్లో త్రివేణి ప్రభంజనం

29-04-2026 05:48 PM

సత్తా చాటిన కొత్తగూడెం త్రివేణి విద్యార్థులు

కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో త్రివేణి విద్యార్థులు అత్యధిక మార్కులను సాధించి తమ ప్రతిభను చూపారు.  రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో, త్రివేణి విద్యార్థులు విజయదుంధిభి మ్రోగించారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో త్రివేణి - కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీశ్ పాత్రికేయుల సమావేశంలో ప్రకటనను విడుదల చేసారు. తమ విద్యార్థులు గత ఎస్.ఎస్.సి ఫలితాలలో, నేటి నేటి ఫలితాల మార్కుల్లో, కూడా త్రివేణి ముందంజలో ఉందని నిరూపించుకుంది.

ఎస్.ఎస్.సి మార్కుల ప్రకారం 600కి మార్కులు 595  విద్యార్థిని లక్ష్మిశెట్టి నేహ (H.T No:2631118553) సాధించినదని తెలిపారు. ఇవే కాకుండా 592,591, 591, 587, 586, 586, 586, 586, 585, 585, 585, 585, 584, 583, 583, 583, 583, 583, 583, 582, 582, 582, 582, 581, 581, 581, 581, 581, 581, 581, 581, 580 ఆ పైన సాధించిన వారు 32 మంది, 570 పైన సాధించినవారు 81 మంది సాధించి రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన ఫలితాలు సాధించి త్రివేణిని మొదటి స్థానంలో నిలిపారు.

కొత్తగూడెంలోని త్రివేణి హైస్కూల్లో 600 మార్కులకు గాను బైరెడ్డి అక్షయ శివాని 592 మార్కులు, పి. అక్షయ్ 586, కె. వర్షిత 586, టి.కుందనిక 585 మార్కులను సాధించి కొత్తగూడెం త్రివేణి ఖ్యాతిని చాటిచెప్పారు. 580 పైన ఐదుగురు, 570 పైన 17 మంది, 550 పైన 57 మంది, 500 పైన 198 మంది సాధించారని డైరెక్టర్ గొల్లపూడి జగదీష్ తెలిపారు. కొత్తగూడెం పట్టణంతో పాటు జిల్లా, రాష్ట్రస్థాయిలో తన కంటూ ఒక ప్రత్యేకతను త్రివేణి కలిగి ఉందన్నారు.

అనుభవం, అంకిత భావం గల బోధనా సిబ్బంది ఉండటంవలన ఈ సంచలన విజయాలు సాధించడం సాధ్యమైందని పేర్కొన్నారు. విజయం సాధించిన విద్యార్థులకు త్రివేణి పాఠశాలల డైరెక్టర్స్ శ్రీ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, గొల్లపూడి జగదీశ్, సి.ఆర్.ఓ. కాట్రగడ్డ మురళీ కృష్ణ, ప్రిన్సిపాల్స్ వి. సూర్యనారాయణ మూర్తి, శ్రీనివాస్ సింగ్, నేతాజీ మరియు వైస్ ప్రిన్సిపాల్ సౌజన్య అభినందలను తెలిజేశారు.