29 April, 2026 | 7:11 PM

571 మార్కులతో మండలంలో ప్రథమ స్థానం సంపాదించిన ఎం మాన్విత

29-04-2026 05:45 PM

దమ్మపేట,(విజయక్రాంతి): బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్షల ఫలితాలలో మండల పరిధిలోని నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం మాన్వితకు మండలంలో అత్యధికంగా 600 మార్కులకు గాను 571 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానం సంపాదించింది. మండలంలోని ఎనిమిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 277 మంది విద్యార్థులకు గాను 275 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా మిగిలిన ఆశ్రమ, గురుకుల పాఠశాలలో మొత్తం 438 మంది విద్యార్థులకు గాను 438 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి ప్రత్యేక అభినందనలు తెలిపారు.