పారమిత లో “త్రింశత్ వైభవం” వార్షికోత్సవ వేడుకలు
ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని మంకమ్మ తోట పారమిత ఉన్నత పాఠశాలలో “త్రింశత్ వైభవం” అనే పేరుతో నిర్వహిస్తున్న వార్షికోత్సవ వేడుకలలో భాగంగా సోమవారం రెండవరోజు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారమిత విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇనుగంటి ప్రసాద రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విధ్యార్థులు చేసిన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే ఆహ్లాదకరమైన నృత్య ప్రదర్శనలు, భక్తి పారవశ్యమైన గేయాలాపనలు, పరమ శివుని శివతాండవం,
తెలంగాణ రాష్ట్ర పోరాట పటిమ గల సమ్మక్క సారలమ్మల సాహసం, తెలంగాణ జానపద కేళీల హరివిల్లు, నయనానందకరంగా ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, వినోదరావు, రాకేశ్ ప్రసాద్, ప్రాచీ, వి.యు.ఎం. ప్రసాద్, హన్మంతరావు ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవిత ప్రసాద్, శ్రీకర్, శర్మిష్ట, గోపీకృష్ణ, సమన్వయ కర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




