అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ : గుండా నిరంజన్
28-08-2026 08:09 PM
గుండా నిరంజన్ కు రాఖీ కట్టిన మహిళలు
మల్కాజిగిరి,(విజయక్రాంతి): అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ అని మల్కాజిగిరి కాంగ్రెస్ మీడియా కన్వీనర్ గుండా నిరంజన్ అన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకోని శుక్రవారం మల్కాజిగిరి మహిళా కాంగ్రెస్ అధ్య క్షురాలు ఆశ ఆధ్వర్యంలో గుండా నిరంజన్ కు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా గుండా నిరంజన్ మాట్లాడుతూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ అనేది అక్క తమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల ఆప్యాయత, అనురాగానికి ప్రతీక అన్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు యూసుఫ్, మల్కాజ్గిరి మహిళా కాంగ్రెస్ నాయ కురాలు భాగ్యలక్ష్మి జన, చైతన్య, చిన్న రాణి, రోజా రమణి, జిన్ని, మహాలక్ష్మి అనిత తదితరులు పాల్గొన్నారు.






