28 August, 2026 | 8:38 PM

విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం

28-08-2026 07:55 PM

కరీంనగర్,(విజయక్రాంతి): పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, డిస్కములను ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు 26 ఏళ్ల క్రితం నిర్వహించిన విరోచిత విద్యుత్ పోరాటంలో అమరులైన బాలస్వామి విష్ణువర్ధన్ రామకృష్ణల స్ఫూర్తితో ఉద్యమించాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున బద్దం ఎల్లారెడ్డి భవన్లో వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్, ఏఐఎఫ్బి పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ పోరాట అమరవీరుల స్థూపం దగ్గర పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, ఏఐఎఫ్బి రాష్ట్ర ఇంచార్జ్ జనరల్ సెక్రెటరీ  అంబటి జోజిరెడ్డి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు జిందం ప్రసాద్,  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, బూడిద సదాశివ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, గిట్ల ముకుంద రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు డి నరేష్ పటేల్, నాయకులు గజ్జల శ్రీకాంత్, రాయికంటి శ్రీనివాస్, పుల్లెల మల్లయ్య, సురేష్, వి.శివ కుమార్. సిపిఐ నాయకులు బాకం ఆంజనేయులు, నగునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్,సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు