పర్యావరణ సమతుల్యతకై మొక్కలు నాటాలి
- సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి పిలుపునిచ్చారు.మంగళవారం నారాయణపురం మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.స్థానిక హనుమాన్ వెంచర్ లో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి మొక్కను నాటారు.
అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి కరువు నుండి రాబోయే తరాలను కాపాడడానికి వన సంరక్షణే మార్గమని అన్నారు.మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంకటేష్, పందుల యాదగిరి గౌడ్, బల్గూరి శివ, పట్నం బాలకృష్ణ గౌడ్, సభావత్ రఘునాయక్, సింగపంగా ప్రశాంతి రమేష్, పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహ, ఎర్రోళ్ల లింగస్వామి, గునిగంటి రాజు గౌడ్, రాచకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.






