1 July, 2026 | 6:42 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

ట్రావెల్ విత్ సాయిరథన్ యాత్ర ప్రారంభం

03-02-2026 12:31 AM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక, సామాజిక బహిర్గతం కార్యక్రమం గురించి తెలియజేయడానికి ట్రావెల్ విత్ సాయిరథన్ యాత్ర చేపట్టడం జరిగిందని డాక్టర్ మధిరాజ్ సాయిరథన్ అన్నారు. ఘట్ కేసర్ పట్టణం శివారెడ్డి గూడలో సోమవారం ట్రావెల్ విత్ సాయిరథన్ యాత్ర ప్రారంభించారు.

ఈ సందర్భంగా సాయి రతన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం కింద, రైతులు, పట్టభద్రులు సోషల్ మీడియా ప్రభావశీలులు వంటి విభిన్న నేపథ్యాల నుండి 10 మంది తెలంగాణలోని ఐదు జిల్లాలు వరంగల్, హైదరాబాద్, హన్మకొండ, కరీంనగర్, భూపాలపల్లి లోని మారుమూల గ్రామాల నుండి ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరు చెన్నై, ఊటీ, పుదుచ్చేరి, తిరువణ్ణామలై బెంగళూరుతో సహా తమిళనాడు  కర్నాటకతో సహా బహుళ గమ్యస్థానాలలో విద్యా సాంస్కృతిక యాత్రను చేపడతారని పేర్కొన్నారు.

ఈ ప్రయాణంలో వారు ఈప్రాంతాల నుండి వైద్యులు, రాజకీయ నాయకులు, రైతులు స్థానిక సంఘం నాయకులతో సంభాషిస్తారని తెలిపారు. ట్రావెల్ విత్ సాయిరథన్ కార్యక్రమం ముఖ్య లక్ష్యం సాంస్కృతిక మార్పిడి, సామాజిక అవగాహన విజ్ఞాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఉంటుందన్నారు. ఈ యాత్రలో పేరుక వంశీ (స్టూడెంట్ వరంగల్), యాక్టర్ లక్కీ (ఇంస్టాగ్రామ్ ఇన్ఫు్ల ఇన్సర్ వరంగల్), సాయికృష్ణ సందీప్ (ఇంస్టాగ్రామ్ ఇన్ఫు్ల ఇన్సర్ హైదరాబాద్), అనిల్ (రైతు హనుమకొండ), అమ్మ రాజు (రైతు ములుగు భూపాలపల్లి), రోహన్ (ఇంస్టాగ్రామ్ ఇన్ఫు్ల ఇన్సర్ (కరీంనగర్), సాయిరాం (స్టూడెంట్ హైదరాబాద్), సాయి జక్కుల (స్టూడెంట్ మంచిర్యాల కరీంనగర్), సుశీల్ (స్టూడెంట్ హైదరాబాద్) ఉన్నారు.