19 May, 2026 | 1:26 AM

ఇంటర్ విద్యా ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలి

19-05-2026 12:00 AM

టీజీవో ఉపాధ్యక్షుడు రామకృష్ణ

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్న ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేపట్టాలని టీజీ వో కేంద్ర సంఘం ఉపాధ్యాక్షులు మాచర్ల రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఈమేరకు సోమవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ను ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ఫిబ్రవరిలో జరిగిన వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్స్, స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులలో పనిచేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ, టీఏ, రెమ్యూనరేషన్‌లను చెల్లిం చాలని కోరారు.