16 May, 2026 | 4:52 PM

నిర్మల్ అభివృద్ధి ద్రోహి ఎమ్మెల్యే

16-05-2026 04:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటున్న మహేశ్వర్ రెడ్డి ప్రజా కోర్టులో ద్రోహిగా మారే రోజులు దగ్గరపడ్డాయని రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి ద్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మహేశ్వర్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి నిర్మల్ నియోజకవర్గంలో మొక్క జొన్న, వరి జొన్న కొనుగోళ్ల రైతులకు న్యాయం చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే వైఖరితోనే నిర్మల్ నియోజకవర్గంలో రైతులు కోసపడుతున్నారని ఆరోపించారు.

కొనుగోళ్లపై ఇప్పటివరకు ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించకపోవడం రైతు పంటలపై అవగాహన లేదని ఆరోపించారు. రాజకీయానికి కోసం రైతులతో కలిసి ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు.  రైతులపై ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కి ఏమాత్రం శుద్ధి లేదని పేర్కొన్నారు. పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండ ఉంటూ ప్రతి గింజ కొనుగోలు చేస్తామని తెలిపారు . నిర్మల్ జిల్లాలో తమ అయామ్ లో మంజూరైన పనులను ఎమ్మెల్యే పర్సెంటేజ్ ల కోసం అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యేగా గెలిచి రెండున్నర ఏళ్ళు పూర్తి అయిన నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఏమి చేశారని  ప్రశ్నించారు.  నిర్మల్ రైల్వే లైన్ మంజూరు అయిందని ప్రజలను పక్కదారి పట్టించాలని ఆరోపించారు. ఆర్మూర్   అదిలాబాద్ రైల్వే లైన్ మంజూరులో ఎమ్మెల్యేలు ఎంపీలు వైఫల్యం చెందారని దీనికి నైతిక బాధ్యత బిజెపి ఎమ్మెల్యేలు పాటించాలన్నారు. నిర్మల్ లో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మెడికల్ కళాశాల హరిత హోటల్ నర్సింగ్ కళాశాల వంటి పనులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

కాంట్రాక్టర్లకు డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా మహేశ్వర్ రెడ్డి అన్ని రంగాల్లో వైఫల్యం చెందారని ఎక్కడికి వెళ్లినా ఆయన ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో మహేశ్వర్ రెడ్డికి ప్రజలు పెద్ద ఎత్తున గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు రఘునందన్ రెడ్డి, పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి బన్సపల్లి రమణారెడ్డి రాందాస్ కృష్ణ ప్రసాద్ రెడ్డి పార్టీ నాయకులుతదితరులు ఉన్నారు