16 May, 2026 | 5:04 PM

దోస్త్ రెండో విడుత అడ్మిషన్లు ప్రారంభం: ప్రిన్సిపాల్ జయ

16-05-2026 04:15 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలంలో గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఈ నెల 15వ తేదీ నుంచి దోస్త్ రెండో విడుత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు విద్యార్థినులు దోస్త్ వెబ్‌సైట్‌లో ఐడి క్రియేట్ చేసుకుని కళాశాలలో సంప్రదించాలని సూచించారు. 

కళాశాలలో ఎంపీసీ, ఎంపీసీఎస్, బీజెడ్సీ, ఎంజెడ్సీ, బీకాం కంప్యూటర్ అప్లికేషన్‌తో పాటు బీఏ గ్రూపుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంటర్ పూర్తిచేసిన గిరిజన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9985607074, 8008374874 నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ జయ సూచించారు.