10 May, 2026 | 7:00 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

రేపు నాటుకోళ్ల పెంపకంపై శిక్షణ

20-02-2026 08:02 PM

ఆర్గానిక్ ఫామ్ రైతు పిట్టల శ్రీశైలం

ఘట్ కేసర్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధికి దోహదపడే దేశీ నాటుకోళ్ల పెంపకంపై ఈ నెల 21న (శనివారం) ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్గానిక్ రైతు పిట్టల శ్రీశైలం తెలిపారు. ఘట్ కేసర్ సర్కిల్ పరిధి అంకుషాపూర్ లోని పిట్టల ఆర్గానిక్ ఫామ్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందించే వ్యవసాయ అనుబంధ రంగాలలో దేశీ నాటుకోళ్ల పెంపకం ఒక్క అవకాశమని పేర్కొన్నారు. రైతులు, మహిళా సంఘాలు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో దేశీ నాటుకోళ్ల జాతుల ఎంపిక, బ్రూడింగ్ దశ నుండి మార్కెట్ వరకు నిర్వహణ విధానాలు, సహజ ఆహారం తయారీ, సహజ మందుల వినియోగం, వ్యాధి నివారణ చర్యలు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే పద్దతులు వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. మార్కెటింగ్ అవకాశాలు, నేరుగా వినియోగదారులకు విక్రయ విధానాలు, లాభనష్టాల అంచనా వంటి అంశాలను కూడ వివరించ నున్నట్లు చెప్పారు. ఈ శిక్షణకు హాజరయ్యే రైతులకు ప్రాక్టికల్ డెమెతో పాటు అనుభవపూర్వక సూచనలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రయోజనం పొందాలని శ్రీశైలం కోరారు.