24 July, 2026 | 3:51 PM

కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి

24-07-2026 02:34 PM

ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నాయకులు

జన్నారం, (విజయక్రాంతి): నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మంచిర్యాల జిల్లా జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఎంతో ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష పేపర్లు లీక్ కావడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వారు కోరారు.