10 May, 2026 | 8:19 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

సొంత నిధులతో పనులను చేయిస్తున్న కౌన్సిలర్

20-02-2026 08:04 PM

చిట్యాల,(విజయ క్రాంతి):   చిట్యాల మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ తన వార్డు ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను చాటుకుంటూ, కరెంటు వైర్లకు అడ్డుగా ఉన్న కంప చెట్లను శుక్రవారం సొంత ఖర్చులతో జెసిబి సాయంతో తొలగించారు. వార్డులో దొంగలతో చాలా ఇబ్బందులకు గురవుతున్న కాలనీవాసులకు ఇచ్చిన మాట ప్రకారం కంపచెట్లను తొలగించి కాలనీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.

వార్డు ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొందిన ఆయన, కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని పేర్కొన్నారు. వార్డుకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించిన వార్డు ప్రజానీకానికి చిట్యాల కౌన్సిలర్ కుక్కల మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్ తీసుకున్న ఈ చొరవ పట్ల కాలనీవాసులు మారగోని యాదగిరి, రుద్రారపు నరసింహ, రుద్రారపు పెద్దులు, రుద్రారపు లింగస్వామి, అమరోజు మదన్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.