10 May, 2026 | 5:49 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్మెడ లక్ష్మీనరసింహారావు

20-02-2026 07:56 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మల్లబోయిన మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, అలాగే తంగళ్ళపల్లి లింగయ్య అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చల్మెడ లక్ష్మీనరసింహారావు, బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధిత కుటుంబాలను పరామర్శించారు. కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామంకు వెళ్లి మల్లబోయిన మహేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అలాగే తంగళ్ళపల్లి లింగయ్య కుటుంబాన్ని కలిసి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, మాజీ ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సీనియర్ నాయకులు పొన్నం పర్షరాములు, నాగుల రాజు, సిద్ధంశెట్టి శ్రీనివాస్, కొమ్ము ఎల్లయ్య, ప్రశాంత్, గోపాల్, శివ తేజ తదితరులు పాల్గొన్నారు.