24 July, 2026 | 3:50 PM

సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఆర్ఎం

24-07-2026 02:38 PM

కాగజ్‌నగర్(విజయ క్రాంతి): దక్షిణ మధ్య రైల్వే (SCR) డీఆర్ఎం గోపాలకృష్ణన్, సీనియర్ డీఓఈ ఎం. మహేంద్ర వర్మ శుక్రవారం సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి విస్తృతంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, ప్రయాణికుల వేచి ఉండే హాళ్లు, తాగునీటి సౌకర్యం, వాహనాల పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ భద్రత, టికెట్ కౌంటర్లు తదితర సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించడంతో పాటు స్టేషన్‌లో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను నిరంతరం పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.