24 July, 2026 | 3:51 PM

కోనరావుపేటలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

24-07-2026 02:36 PM

- వికలాంగులు, గిరిజన విద్యార్థులకు పండ్ల పంపిణీ

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం స్థానిక వికలాంగుల పాఠశాల, గిరిజన సంక్షేమ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ భూమిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాందాల శ్రీనివాస్, గోపు పరశురాములు, చిట్నేని శివతేజ, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.