సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు శిక్షణ
21-07-2026 12:00 AM
చిన్నంబావి, జూలై 20: మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం మండల విద్యాశాఖ అధికారి రాజేందర్ రావు జెడ్పీహెచ్‌ఎస్ పెద్దదగడలో ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం 9:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని,తెలుగు, ఆంగ్లము, గణితశాస్త్రం, పరిసరాల విజ్ఞానం విషయాల్లో రీసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ పేర్కొన్నారు.






