10 March, 2026 | 5:03 AM

నూనె గింజలపై రైతులకు శిక్షణ

10-03-2026 02:02 AM

కొండపాక, మర్చి 9: వ్యవసాయ శాఖ - ఆత్మ ఆధ్వర్యంలో కుకునూరు పల్లి మండలం మేదినీపూర్ గ్రామంలో సోమవారం రైతులకు నూనె గింజలపై శిక్షణ కార్యక్రమాన్ని గజ్వేల్ ఏ డి ఏ బాబు నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు నాయక్ మాట్లాడుతూ నూనె గింజలలో ముఖ్యమైన పంట ఆయిల్ ఫామ్ ఇది ప్రపంచంలో అత్యధికంగా నూనె ఉత్పత్తి చేసే నూనె గింజల పంట ప్రధానంగా ఆహార, పారిశ్రామిక ఇతర అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది.

అధిక దిగుబడి, రైతులకు మంచి ఆదాయం వచ్చే పంటగా గుర్తింపు పొందింది. ఆయిల్ ఫామ్ నుంచి తీసే పామ్ ఆయిల్ వంట నూనెగా ఎక్కువగా ఉపయోగిస్తారు. బిస్కెట్లు, చాక్లెట్లు, బేకరీ పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. మర్జరీన్ షార్టెనింగ్ వంటి ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. ఐస్ క్రీం, నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్, పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. పామాయిల్ లో ఏ, ఇ విటమిన్ ఉండడం వల్ల శరీరానికి శక్తినిస్తుంది. పారిశ్రామిక ఉపయోగాలలో సబ్బులు, డిటర్జెంట్ తయారీలో ప్రధాన ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. కాస్మెటిక్స్ క్రీములు, లోషన్లు, లిప్స్టిక్ తయారీలో కాండిల్ తయారీలో ఉపయోగిస్తారు.

బయో డీజిల్, పెయింట్లు వార్నిష్ వంటి వాటిలో కూడా ఉపయోగిస్తారు. ఆయిల్ తీసిన తరువాత మిగిలి ఫామ్ కర్నెల్ కేక్ పశువులకు మంచి ఆహారంగా ఉపయోగిస్తారు, ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల పశువుల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఆయిల్ ఫామ్ చెట్టు ఆకులు కంపోస్టు ఎరువుగా, కాండం కొన్ని ప్రాంతాలలో ఇంధనం, నిర్మాణ పనులలో ఉపయోగిస్తారు. పాము చెట్టు అవశేషాలను సేంద్రియ ఎరువులుగా ఉపయోగించవచ్చు. ఇతర నూనె పంటలతో పోలిస్తే అధిక దిగుబడి ఇస్తుంది, ఒక హెక్టారుకు సంవత్సరానికి సుమారుగా 4నుంచి 6 టన్నుల వరకు నూనె ఉత్పత్తి చేయవచ్చు రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చే దీర్ఘకాల పంట. గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది.

ఈ సందర్భంగా కుక్కునూరుపల్లి ఏవో గోవిందరాజు మాట్లాడుతూ వేరుశనగ పంట ఒక ముఖ్యమైన నూనె గింజల పంట, భారతదేశంలో ఇది విస్తృతంగా సాగు చేయబడుతుంది. వేరుశనగ గింజలలో నూనె శాతం ఎక్కువగా ఉండటం వల్ల నూనె తయారీకి ప్రధానంగా ఉపయోగిస్తారు. ఆహారంగా, పశువులకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వేరుశనగ నూనె గింజలలో సుమారు 45 నుంచి 50 శాతం నూనె,25నుంచి 30శాతం ప్రోటీన్ ఉంటుంది.

మన శరీరానికి అవసరమైన విటమిన్ ఇ, బికంప్లెక్స్ ఉంటాయి. నూనె తీయగా మిగిలిన భాగాలు పశువులకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. నేలలో నైట్రోజన్ శ్రీకరణ జరగడం వల్ల నేల సారాన్ని పెంచుతుంది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కొండపాక మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ బూర్గు మధుమోహన్, ఆత్మ బిటిఎం అశ్లేష, ఏఈఓ రమ్యశ్రీ, శ్రీహరి ఇతర రైతులు పాల్గొన్నారు.