3 April, 2026 | 6:06 PM

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు

03-04-2026 04:25 PM

హైదరాబాద్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో స్టీల్ బ్రిడ్జ్, అండర్ పాస్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వివరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ జాయింట్ సీపీ మాట్లాడుతూ... రోడ్డు నిర్మాణ పనులకు వాహనదారులు సహకరించాలని, ఇప్పుడు చేసేది పైలెట్ స్టడీ మాత్రమే. పరిస్థితులను బట్టి మార్పులు ఉంటాయని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల నిర్మాణాలు తొలగించాల్సి వస్తుందని జోయల్ డేవిస్ పేర్కొన్నారు.