21 July, 2026 | 7:01 PM

ఆరు గ్యాంరటీల్లో మెజారిటీ హామీలు అమలు చేశాం

21-07-2026 02:42 PM
  1. బీఆర్ఎస్ పదేళ్ల అరాచక పాలన.. ప్రజలు మర్చిపోలే.
  2. అర్హులకు సన్నబియ్యం ఇస్తున్నాం.
  3. రూ. 23 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దే.

నిజామాబాద్: ఆరు గ్యారంటీల్లో మెజారిటీ హామీలు అమలు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) నిజామాబాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బీఆర్ఎస్ పదేళ్ల అరాచక పాలనను ప్రజలు మరిచిపోలేదని తెలిపారు. రాష్ట్రంలో అర్హులకు సన్నబియ్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గానికి 3 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. రూ. 23 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. దావోస్ లో రూ. 1.7 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ లో రూ. 5.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని లెక్క చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమన్నారు. గత పాలనలో అటకెక్కించిన ఉద్యోగాలను తామిచ్చామని మహేష్ గౌడ్ వెల్లడించారు.