చలిమెడను సత్కరించిన సునీల్ రావు
ముకరంపుర,(విజయక్రాంతి): అమెరికాకు చెందిన మేరీల్యాండ్ యూనివర్సిటీ నుండి ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ అందుకున్న కరీంనగర్ డైరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వరరావును సప్తగిరి కాలనీలోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కలిసి శాలువతో సత్కరించారు. గత 40 సంవత్సరాలుగా కరీంనగర్ డైరీని విజయపథంలో నడిపిస్తూ, పాడి పరిశ్రమలో ఆయన చేసిన కృషికి, విశేష సేవలకు గుర్తింపుగానే మేరీల్యాండ్ యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయడం జరిగిందని సునీల్ రావు కొనియాడారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో కరీంనగర్ డైరీ పేరును దేశవ్యాప్తంగా మారుమ్రోగేలా మరింతగా కృషి చేయాలని, పాడి పరిశ్రమ అభివృద్ధికి మరిన్ని నూతన కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ, డాక్టరేట్ పొందిన శుభ సందర్భంగా రాజేశ్వరరావు కు సునీల్ రావు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.






