21 July, 2026 | 9:24 PM

Breaking News

బూర్గంపాడు గ్రంథాలయానికి మూత్రశాలల సౌకర్యం కల్పించాలి   •   ప్రకృతి ఆరాధనకు ప్రతీక శీతల భవానీ పండుగ   •   ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్   •   అఖిల్ హాస్పిటల్ చైర్మన్ ఉమామహేశ్వరరావు కన్నుమూత   •   బాలికల హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ   •   తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదే: చంద్రశేఖర్ తివారి   •   ఐటీఐ-ఏటీసీ విద్యార్థులు ప్రైవేట్ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి   •   దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం...   •   దుబాయ్‌లో బోనాల ఉత్సవాలు   •   ఎమ్మెల్యే నాయినికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పొంగులేటి, పొన్నం   •  

వర్షం కోసం ముత్యాలమ్మకు మొక్కులు

21-07-2026 06:28 PM

రాళ్లగూడెంలో గంగస్నానం, బోనాలతో అంగరంగ వైభవం..

చర్ల,(విజయక్రాంతి): చర్ల మండలం రాళ్లగూడెం గ్రామంలో పంటలు బాగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులందరూ ఆలయం వద్దకు చేరుకుని గంగస్నానం, బోనాల సమర్పణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. గ్రామంలోని మహిళలు, పెద్దసంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు నూప రమేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "అమ్మవారి చల్లని చూపు గ్రామ, మండల ప్రజలందరి పై ఉండాలి. భారీ వర్షాలు కురిసి రైతుల పొలాలు పచ్చబడాలనీ కోరారు. భక్తి గీతాలు, కోలాటాలతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది.