25 April, 2026 | 6:01 PM

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు

25-04-2026 04:22 PM

తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి 

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా, చేగుంట పట్టణ కేంద్రం లో గల ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్‌ను 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక (వెల్ఫేర్ వీక్)లో భాగంగా తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి, చేగుంట తాసిల్దార్ శివప్రసాద్ తో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ.. విద్యార్థుల శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలాన్ని, క్రమశిక్షణను పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడాకారులు జట్టు భావనతో మెలిగి, పట్టుదలతో సాధన చేసి అటు పాఠశాలకు, ఇటు జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.