25 July, 2026 | 1:29 PM

విద్యార్థులతో మోదీ వీడియోలతో ఆటలాడుతున్నారు!

25-07-2026 12:33 PM
  1. పోరాడుతున్న యువతే దేశ భవిష్యత్తు
  2. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాయే విద్యార్థులకు ఆమోదయోగ్యం
  3. విద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాలి
  4. ప్రభుత్వమంతా ఏకమైన విద్యార్థులను కదిలించలేరు
  5. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో తగ్గేదే లేదు: విద్యార్థులు

న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా(Union Minister Dharmendra Pradhan resigns) చేయాలని విద్యార్థులంటున్నారని లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అసంబద్ధ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్చడం కూడా ఆమోదయోగ్యం కాదని రాహుల్ స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాయే విద్యార్థులకు ఆమోదయోగ్యం అన్నారు. ఉద్యమించిన విద్యార్థులపై పోలీసులు దారుణంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యారులతో ప్రధాని వీడియోల ద్వారా ఆటలాడుతున్నారని విమర్శించారు. విద్యార్థులకు ప్రధాని మోదీ(Narendra Modi) క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పోరాడుతున్న విద్యార్థులను చూసి గర్వపడుతున్నానని రాహుల్ పేర్కొన్నారు. వ్యవస్థలోని లోపాలను విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వమంతా ఏకమై వచ్చినా విద్యార్థులను కదిలించలేరని తేల్చిచెప్పారు. పోరాడుతున్న విద్యార్థులే భారత దేశ భవిష్యత్ అన్నారు. రాహుల్ గాంధీతో తాము చర్చించినట్లు విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల సమస్యలను రాహుల్ గాంధీ అర్థం చేసుకున్నారని సూచించారు. బీహార్ లోనూ విద్యార్థులపట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు.