28 February, 2026 | 6:36 AM

నేడు భావ రస నాట్యోత్సవం

28-02-2026 02:14 AM

రవీంద్ర భారతిలో సీజన్ 2

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ‘మదాలస- స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’ ఆధ్వర్యంలో ’భావ రస నాట్యోత్సవం సీజన్ 1’ ఈ ఏడాది జనవరి 4న కన్నులపండువగా జరిగింది. ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య కళాకారులు సౌజన్య శ్రీనివాస్, మంజు వి. నాయర్, స్వప్న రాజేంద్రకుమార్ నృత్య ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఇప్పుడు ’భావ రస నాట్యోత్సవం సీజన్ 2’ ఈ నెల 28న సాయంత్రం 6:30 గంటల నుండి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరగనుంది.

ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య కళాకారులచే భరతనాట్యం, కూచిపూడి ప్రత్యేక ప్రదర్శనలకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. కళారత్న సౌజన్య శ్రీనివాస్ భరతనాట్యం, కూచిపూడి (హైదరాబాద్), ప్రమోద్ రెడ్డి, అభినేత్రి ఎన్సెంబుల్ భరతనాట్యం (హైదరాబాద్), ఎం. సురేంద్ర నాథ్ (ఎస్‌ఎన్‌ఏ యువ పురస్కార్ అవార్డు గ్రహీత), డా. బిజినా సురేంద్ర నాథ్ కూచిపూడి (హైదరాబాద్).  ప్రత్యేక అతిథులుగా రవి పాడి, ఐఆర్‌టీఎస్, చీఫ్ కమర్షియల్ మేనేజర్, దక్షిణ మధ్య రైల్వే, అనుగు నర్సింహారెడ్డి, డైరెక్టర్, భాషా, సాంస్కృతిక శాఖ, వీర్నాల బాలాజీ, చైర్మన్ వీర్నాల ఫౌండేషన్ పాల్గొంటారు. వ్యాఖ్యాతగా వాచస్పతి అంబడిపూడి మురళీకృష్ణ వ్యవహరించనున్నారు.