28 February, 2026 | 6:26 AM

పెండింగ్ బిల్లులకు 745 కోట్లు

28-02-2026 02:12 AM
  1. పంచాయతీలకు 389 కోట్లు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీల ను వరుసగా అమలు చేస్తోంది. ఉద్యోగు ల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సర్కార్ గ్రీన్ ఛానల్‌లో నిధులను విడుదల చేస్తోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిం ది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ.745 కోట్లు విడుదల చేసింది.

ఫిబ్రవరి మాసానికి సంబంధించిన బిల్లు ల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధి కారులు నిధులు విడుదల చేశారు. ఉద్యోగులకు ప్రతినెలా రూ. 700 కోట్లకు తగ్గ కుండా పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు గత జూన్ నెలాఖరులో 183 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసంగా రూ .700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. విడుదలైన బిల్లులో గ్రాట్యూటీ, జిపిఎఫ్, సరెండర్ లీవ్, అడ్వాన్సులు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులు రూ. 389 కోట్లు విడుదల చేశారు.