4 March, 2026 | 1:15 PM

నేడు కూడా రంగుల పండుగ

04-03-2026 12:00 AM

కరీంనగర్, మార్చి3(విజయక్రాంతి):హోలీ తేదీ గత సంవత్సరం లాగే ఈ సారికూడా చాలా మందిలో గందరగోళాన్ని సృష్టించింది.హోలీ పండుగను హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు, స్థిర ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం కాదు. హోలీ పండుగ ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది.చంద్ర క్యాలెండర్ చంద్ర చక్రాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, తేదీలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి.

పూర్ణిమ తిథి సమయం మరి యు దాని ప్రారంభ మరియు ముగింపు గంటలు వేడుక యొక్క ఖచ్చితమైన రోజును నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.అందరితో కలిసి రంగులు చల్లుకునే సరదా పండుగ.  హోళీఈ  సారి మంగళవారం కొందరు జరుపుకోగాచాలా నంది 4న జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిండి గ్రహణానికి 9 గంటల ముందే (ఉద యం 6:30 నుంచి) సూతకం ప్రారంభమవడంతో .సూతక కాలంలో ఆలయాల్లో పూ జలు నిలిపివేశారు.

ఇలాంటి సమయంలోఎలాంటి పండుగ వేడుకలు జరపకూడని కొందరు పండితులు చెప్పడంతో కొందరు మంగళవారం వేడుకలకు దూరంగా ఉన్నా రు. ఎటువంటి దోషం లేకుండా ఉన్న మార్చి 4, బుధవారం నాడు జరుపుకోవడం ఉత్తమం. అని సూచించడంతో కొందరు బుధవారం కు సిద్దం అవుతున్నారు.

జగిత్యాల లో..

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా  హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు  సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది. హోళీ సందర్భంగా ఎస్పీ  అశోక్ జిల్లా ప్రజలందరికీ  హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

కరీంనగర్ లో..?

నగరంలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. వేడుకల్లో  ప్రజలు భారీగా పాల్గొని ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు.చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా గడిపారు సంగీతం, నృత్యాలతో  కిక్కిరిసిపోయి పండుగ వాతావరణం నెలకొంది. భగత్నగర్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు కార్యాలయం ఆవరణలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.