8 May, 2026 | 3:05 PM

Breaking News

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన.. ఉర్దూ పోస్టర్‌ ఆవిష్కరణ   •   తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో ప్రాణహిత జలాలకు వినియోగం: మంత్రి జూపల్లి కృష్ణారావు   •   పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత   •   పుల్లాయిగూడెం నూతన రామాలయం ప్రారంభోత్సవం   •   కొడంగల్‌లో శ్రీవేంటేశ్వర స్వామి ఆలయానికి సీఎం భూమిపూజ   •   జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య   •   ఎస్ పీఎల్ క్రికెట్ విజేతకు లక్ష నగదు, ట్రోఫీ అందజేత   •   రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు   •   వేసవి శిబిరం సద్వినియోగం చేసుకోగలరు: ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి   •   కొలనూరు చెరువు వద్ద రైతు వారోత్సవాలు నిర్వహణ   •  

నేటి బాలలే రేపటి దేశ నిర్మాతలు

26-02-2026 12:45 AM

గిన్నిస్ రికార్డ్ హోల్డర్ పెండెం కృష్ణ కుమార్

నూతనకల్, ఫిబ్రవరి 25: నేటి బాలబాలికలే భవిష్యత్తులో దేశాభివృద్ధికి మూలస్తంభాలని, ప్రతి విద్యార్థి తమ బాధ్యతను గుర్తించి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఫోర్ టైమ్స్ గిన్నిస్ వరల్ రికార్డ్ హోల్డర్ పెండెం కృష్ణ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని పెదినిమిల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలు, భారతదేశం మరియు తెలంగాణ రాష్ట్ర మ్యాపులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి జాతీయ నాయకులు, శాస్త్రవేత్తల జీవిత చరిత్రల గురించి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు.విద్యార్థులు ఇష్టంతో విజ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఉన్నత పదవులను అధిరోహించి, సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగాలన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. నీరజ, ఉపాధ్యాయులు వై. చంద్రశేఖర్ రెడ్డి, బి. కెనడి, ఎన్. రజిత, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.