9 May, 2026 | 9:46 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

నీ మాయలో పడేట్టుగా..

30-01-2026 12:00 AM

నరేశ్ అగస్త్య హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ ‘అసురగణ రుద్ర’. ఈ చిత్రంతో మురళీ కాట్రాగడ్డ దర్శకుడిగా పరిచ యం అవుతున్నారు. మురళి కమ్జుల, వంశీ కాంజుల నిర్మిస్తున్నారు. సంగీర్తన విపిన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ఆర్యన్ రాజేశ్, ఆమని, శుభలేఖ సుధాకర్, శత్రు, రవివర్మ, నిఖిల్ దేవదూల, బేబీ శ్రీదేవి కీలక పాత్రలు పోషిస్తున్నా రు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘నీ మాయలో పడేట్టుగా..’ అనే పాటను రిలీజ్ చేశారు.

శేఖర్‌చంద్ర స్వరపర్చిన ఈ గీతాన్ని చైతు సత్సంగి రాయగా రమ్య బెహరా, సిద్ధార్థ్ మీనన్ ఆలపించారు. కొత్తగా పెళ్లయిన జంట ప్రేమను సెలబ్రేట్ చేసే ఈ పాటలో నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిత్రానికి  సంగీతం: శేఖర్‌చంద్ర; డీవోపీ: అమర్‌నాథ్ బొమ్మిరెడ్డి; ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్; ప్రొడక్షన్ డిజైన్: రఘు కులకర్ణి; నిర్మాతలు: మురళి కమ్జుల, వంశీ కాంజుల; కథ, -స్క్రీన్‌ప్లే, -మాటలు-, దర్శకత్వం: మురళి కాట్రగడ్డ.