14 July, 2026 | 3:41 PM

Breaking News

కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •  

డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న తిప్పారపు సంపత్

13-10-2025 06:58 PM

హుజూరాబాద్ (విజయక్రాంతి): డీసీసీ అధ్యక్ష పదవికి టీపీసీసీ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ హుజురాబాద్ ప్రాంతానికి చెందిన తిప్పారపు సంపత్ దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం కరీంనగర్ లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం దరఖాస్తు ఫారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తూ, విద్యార్థి ఉద్యమాలు, యువజన ఉద్యమాలు, దళిత ఉద్యమాలు చేశానని అన్నారు. బీఆర్ఎస్ అరాచక పాలనలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ అవినీతిపై పోరాడి, నెలల తరబడి జైల్లో గడపడం జరిగిందన్నారు. కేసులకు, జైళ్లకు ఏ ఒక్కరోజు అధైర్య పడకుండా నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో సేవ చేశానని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీ మారలేదని అన్నారు. సామాన్య కార్యకర్త స్థాయి నుండి, దళిత కుటుంబం నుండి వచ్చిన తనకు జిల్లా అద్యక్ష పదవికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.