calender_icon.png 18 February, 2026 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

18-02-2026 12:39:15 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, ఫిబ్రవరి 17 ( విజయక్రాంతి ) : ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పా ట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జి ల్లా కలెక్టర్ ఐడి ఓసీలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య తో కలిసి ఇంటర్ పరీక్షలపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయని, పరీక్షలకు సమన్వయంతో పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షలు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో చేరుకునేలా సూచనలు చేయాలని తెలిపారు. పరీక్షల విధులు నిర్వహించే ప్రతి అధికారి బాధ్యతగా పని చేయాలన్నారు.

జిల్లాలో ఇంటర్జి పరీక్షల కోసం 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 25 పరీక్షా కేంద్రాల ద్వారా 6,216 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 6,437 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 10 ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉంటాయని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశం లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య, వైద్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.