18 July, 2026 | 1:29 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

భక్తులతో కిటకిటలాడిన తుమ్మలపల్లి

21-11-2025 12:00 AM

రామలింగేశ్వర స్వామికి పూజలు

చండూరు, నవంబర్ 20 (విజయక్రాంతి): గురువారం కార్తీక మాసం చివరి అమావాస్య సందర్భంగా నల్లగొండ జిల్లాలోని తుమ్మలపల్లి రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి గణపతి పూజ, పుణ్య వాచనం, రుద్ర హోమము, మృత్యుంజయ హోమము, నవగ్రహాల హోమము నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వారాధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు.

సంఘం యాదయ్య, మనమ దంపతులు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకన్న యాదవ్, దేవాలయ చైర్మన్ గుండ్రెడ్డి రమ్య రామలింగారెడ్డి, కురుపాటి సుదర్శన్, గుండ్రెడ్డి సంజీవరెడ్డి, జక్కలి శేఖర్, భూతరాజు లింగయ్య, కురుపాటి లింగస్వామి, జక్కలి నాగరాజు, అయ్యప్ప స్వాముల, ఆంజనేయులు స్వాముల అర్చక బృందం, కారు వంగ నరసింహ శర్మ, తిరుపతయ్య శర్మ, శంకర్ శర్మ, గిరి ప్రసాద్ శర్మ, ధర్మకర్తలు కురుపాటి వెంకటమ్మ, మత్తయ్య పాల్గొన్నారు.