31 March, 2026 | 1:44 PM

Breaking News

చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •   అకాల వర్షం కుభీర్ ను కుదిపింది… రైతుల కష్టార్జితం నేలమట్టం   •  

కొకెయిన్, గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు

31-03-2026 12:20 AM

శంకర్‌పల్లి, మార్చి 30 (విజయక్రాంతి): మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహాస్ ఫౌండేషన్ సమీపంలో ఇంద్రారెడ్డి నగర్ రోడ్డు పై  కోకైన్, గాంజా తరలిస్తున్న ముగ్గురిని మోకిల,ఎస్‌ఓటి పోలీసులు అదుపు లోకి తీసుకున్న సంఘటన ఈనెల 29వ తేదీన జరిగింది. మోకిలా సీఐ వీరబాబు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహ ఫౌండేషన్ సమీపంలో ఇంద్రా రెడ్డి నగర్ రోడ్డుపై స్విఫ్ట్ కారులో ముగ్గురు వ్యక్తులు కో కైన్, గాంజా తరలిస్తుండగా మోకిలా, ఎస్‌ఓటి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారని తెలిపారు.

ముగ్గురు నిందితుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారని చెప్పారు. ఏ1 పొన్నాల సిద్ధార్థ, ఏ2 చాలా వాడి హేమంత్ కృష్ణవంశీ, ఏ3 అవధూత విష్ణు తేజ మీరు ముగ్గురు కలిసి మాదకద్రవ్యాలను తరలిస్తున్నారని చెప్పారు. పొన్నాల సిద్ధార్థ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారని తెలిపారు.

వీరి వద్ద నుండి 39: 79 గ్రాముల కొకైన్, సుమారు 2-3 గ్రాముల గాంజా( కన్నబీస్) నాలుగు సెల్ ఫోన్ లు, మారుతి కారును స్వాధీనం ఉన్నావని చెప్పారు. ఏ1 సరఫరా చేసేవాడని, ఏ2 మధ్యవర్తిగా వ్యవహరించేవాడని, ఏ3 వినియోగదారుడని తెలిపారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామని సిఐ తెలిపారు. గోవా నుండి మాదకద్రవ్యాలను హైదరాబాద్ లో వీరు విక్రయిస్తున్నారని చెప్పారు.