రైతులను ఇబ్బంది పెట్టిన వారు బాగుపడలేదు
రైతులకు అండగా ఉంటే వ్యక్తిగత విమర్శలా
బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్
రాజాపూర్ మే 10: రైతుల బాధలు పట్టించుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టె ఏ నాయకుడు, ఏ పార్టీ బాగుపడినట్లు చరిత్రలో లేదని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, మాజీ ఎంపీపీ నర్సింహులు, మాజీ సర్పంచ్ బచ్చిరెడ్డి అన్నారు.
ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ యాసంగిలో రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడం చేతగాక మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పైన నోరు పారెసుకోవడం ఎమ్మెల్యేఅనిరుద్ రెడ్డి చేతగానితనానికి అసమర్ధత పాలనకు నిదర్శనమన్నారు. మార్కెట్ యార్డ్ లో మొక్క జొన్నపంట కొనక పోవడంతో రైతులు విసుగు చెందిన రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించడం తప్ప అని ప్రశ్నించారు.
అటుగా వెళుతున్న లక్ష్మారెడ్డి సమస్యను తెలుసుకునేందుకు రైతుల దగ్గరకు వెళ్లి ధర్నా కార్యక్రమంలో పాల్గొని సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోవడం, అక్కడ ఉన్న రైతులకు నచ్చజేప్పి ధర్నా విరమింపజేయడం లక్ష్మారెడ్డి పనితానానికి నిదర్శనమన్నారు. ఇది ఓర్చుకోలేని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాజీ మంత్రిపైన అడ్డగోలుగా విమర్శలు చేయడం అక్కసు వెళ్ళగక్కడం అయన అవివేకానికి నిదర్శనమని విమర్శించారు.
ఎమ్మెల్యేకు నిజంగా రైతుల పైన ప్రేమ ఉంటే కొనుగోలు కేంద్రాలను ఎందుకు పరిశీలించడం లేదన్నారు. బాధ్యత గల ఎమ్మెల్యే రైతుల సమస్య ను పట్టించుకోకుండా దిగజారుడు మాటలు మాట్లాడటం సిగ్గుచేటు అని ఇందుకోసమేనా? ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అవినీతి భూకబ్జాలు అని మాట్లడుతున్న మీరు ఇప్పటి వరకు ఒక్కటి నిరూపించలేదన్నారు. నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా అరికడతానని మాట్లాడిన మీరు ఎందుకు బందు చేయడం లేదన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే ఎవరు నమ్మరని భవిష్యత్తులో ప్రజలు సరైన సమాధానం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సత్తయ్య,శ్రీనివాస్, తిరుపతయ్య,రియాజ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.






