24 July, 2026 | 1:09 PM

రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సాయం

24-07-2026 12:41 PM

కేసముద్రం (విజయక్రాంతి): రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సంద్రి రాజయ్య అనారోగ్యంతో గురువారం రాత్రి మరణించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న రిటైర్డ్ రైల్వే ఎంప్లాయిస్, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం ఆయన ఇంటికి వచ్చి మరణించిన రాజయ్య భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అసోసియేషన్ తరపున 12 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామచంద్రయ్య, కార్యదర్శి పిల్లి ప్రభాకర్, కోశాధికారి అమీర్, సభ్యులు పాల్గొన్నారు.