24 July, 2026 | 1:17 PM

గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కె. హరిత

24-07-2026 12:39 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ కె. హరిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం వంటశాలను తనిఖీ చేసి ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ దత్తారావు, ఎంపీడీవో శ్రీనివాస్,  ప్రిన్సిపాల్ శ్వేత,  ఉపాధ్యాయులు, వసతి గృహ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.