27 March, 2026 | 9:50 PM

Breaking News

కంచర్లలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు   •   బీసీ కమ్యూనిటీ హాల్కు భూమి వితరణ చేసిన కుటుంబసభ్యులకు సన్మానం   •   శ్రీరామ నవమి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ కోట నీలిమ   •   సంగమేశ్వర్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం   •   ఘనంగా శివంపేటలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక   •   గోదావరి నదిలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన డిడిఆర్ఎఫ్ బృందం   •   శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో స్తంభించిన ట్రాఫిక్   •   అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములోరి కళ్యాణోత్సవం   •   సీఈఆర్ క్లబ్‌లో తాగునీరు సౌకర్యాలు కల్పించాలి   •   సీతారాముల పవిత్ర బంధం నేటి తరానికి ఆదర్శనీయం   •  

చెన్నాపురం స్మశాన వాటికలో వృద్ధుడి మృతి

27-03-2026 08:00 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని చెన్నాపురం స్మశాన వాటికలో వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడని తెలిపారు.

మరణించిన వ్యక్తి సుమారు 50 నుండి 55 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉంటాడని చెన్నాపురం ప్రాంతంలో భిక్షాటన చేస్తూ ఉంటాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దావఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.