calender_icon.png 20 February, 2026 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకుల డబ్బుకు న్యాయం చేసే సినిమా ఇది

20-02-2026 01:49:38 AM

శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వీ పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సమావేశంలో హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. “మంచి కంటెంట్‌తో వచ్చే చిత్రాలెప్పుడూ ఫెయిల్ కావు అని నమ్ముతుంటా.

ఈ మూవీ చూసిన తర్వాత ప్రేక్షకులు తమ తండ్రికి ఫోన్ చేసి మాట్లాడతారు. సినిమాలోని ఎమోషన్ కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఆడియెన్స్ మాకు ఇచ్చే టైమ్, పెట్టే మనీకి న్యాయం చేసేలా మా సినిమా ఉంటుంది” అన్నారు. ‘మా నవాబ్ కేఫ్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాన’ని హీరోయిన్ తేజు అశ్విని తెలిపారు. దర్శకుడు ప్రమోద్ హర్ష మాట్లాడుతూ..“నా వరకు వంద శాతం కష్టపడి పనిచేశా. మా సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా” అని చెప్పారు.

నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. “మా సినిమాలో క్రింజ్ కామెడీ, సిల్లీ కామెడీ ఉండదు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ప్రతీ ఫ్రేమ్‌లో ఎమోషన్ కనిపిస్తుంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రమిది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారి, గీత రచయిత సురేశ్ బనిశెట్టి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు