క్యాన్సర్‌ను జయించి నిలి చారు
మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సన్మానం
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి) : మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో నిర్వహించిన క్యాన్సర్ సర్వైవర్ల సన్మాన కార్యక్రమంలో క్యాన్సర్‌ను జయించిన సర్వైవర్లను ఘనంగా సత్క రించారు. సమాజంలో అవగాహన పెంపొందించే లక్ష్యంతో కాంప్లిమెంటరీ క్యాన్సర్ స్క్రీనింగ్ కూపన్‌ను ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకులు శివ నాగేశ్వరరావు, రా మ్ ప్రసాద్, రాజా వన్నెంరెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ కూపన్ ద్వారా అర్హులైన వారికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, నిపుణుల వైద్యుల కన్సల్టేషన్‌తో పాటు 4డీ పెట్‌సీటీ -CT స్కాన్‌పై 50 శాతం రాయి తీ అందించనున్న ట్లు ఆస్పత్రి వెల్లడించింది. ప్రారంభ దశలో గుర్తిస్తే శస్త్రచికిత్స ద్వారా పూర్తిస్థాయిలో నయం చేసే అవకాశాలు పెరుగుతాయని డా. రవిచందర్ (సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్) తెలిపారు.
ఆధునిక చికిత్సలతో అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నియంత్రించవచ్చని డా. వేణుగోపాల్ (మెడికల్ ఆంకాలజిస్ట్) పేర్కొన్నారు. కార్యక్రమంలో డా. సారితా శ్రీవాస్తవ (మెడికల్ ఆంకాలజిస్ట్), డా. ప్రశాంత్ రెడ్డి (రేడియే షన్ ఆంకాలజిస్ట్), మహేష్ డెగ్లూర్కర్ (చీఫ్ బిజినెస్ ఆఫీసర్), డా. జానకిరామ్ (రీజినల్ డైరెక్టర్), శ్రీకాంత్ (సెంటర్ హెడ్), సంపత్ తదితరులు పాల్గొన్నారు.






