16 May, 2026 | 3:40 AM

వాళ్లు బొద్దింకల్లా వ్యవస్థపై దాడి

16-05-2026 12:34 AM

సీనియర్ హోదా విషయంలో  ఓ న్యాయవాదిపై సీజేఐ తీవ్ర అసహనం

న్యూఢిల్లీ, మే 15 : కొంతమంది నిరుద్యో గ యువత మీడియా, సామాజిక మాధ్య  మం, ఆర్టీఐ కార్యకర్తల్లా మారి వ్యవస్థపై దా డి చేస్తున్నారని భారత ప్రధాన న్యాయమూరి(సీజేఐ) సూర్యకాంత్ అసహనం వ్యక్తం చే శారు. సీనియర్ హోదా విషయంలో ఓ న్యా యవాదిపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మీకు తప్ప ప్రపంచంలో ఎవరికైనా సీనియ ర్ హోదా ఇవ్వొచ్చన్నారు. సీనియర్ అడ్వకేట్ హోదా అనేది కోర్టు ప్రసాదించే విశిష్ట గౌరవమని, పిటిషన్లతో వాటిని సాధించుకోలేరన్నారు. కొంతమంది నిరుద్యోగ యువ తను బొద్దింకలుగా పోల్చుతూ వ్యవస్థపై దా డి చేస్తున్నారని  అన్నారు. సీనియర్ న్యాయవాది హోదాను కోరుతున్న ఒక న్యాయ వాదిని మందలిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.