11 August, 2026 | 5:10 PM

ప్రారంభమైన పెన్షనర్ల దరఖాస్తుల స్వీకరణ

11-08-2026 04:28 PM

బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రకటించిన పెన్షనర్ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మంగళవారం ఎంపీడీవో రత్నాకర్ రావు సాకేర గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో  మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 31 వరకు దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మోతి సింగ్ ఉపసర్పంచ్ భీమ్ రావు పలువు లబ్ధిదారులు పాల్గొన్నారు.