16 May, 2026 | 10:48 PM

ఇల్లందు సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తి స్వరూప కాటం

16-05-2026 09:41 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు సబ్ జైల్ ను శనివారం ఇల్లందు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి స్వరూప కాటం సందర్శించి ఖైదీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచనలు చేశారు. మెనూ ప్రకారం సదుపాయాలు అందుతున్నాయో లేవో ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్ జైల్  పరిసరాలను పరిశీలింఛారు. పలు రికార్డులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్జితో పాటు సబ్ జైల్ లీగల్ ఎయిడ్ న్యాయవాది కీర్తి కార్తిక్, సబ్ జైల్ సూపర్డెంట్ చంద్రశేఖర్, జైలు సిబ్బంది, సాంబ, శాంతి స్వరూప్, భాస్కర్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.