11 August, 2026 | 5:35 PM

Breaking News

దన్నూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల యూనిఫామ్ డ్రస్సుల కుట్టడం త్వరలో పూర్తి చేయాలి   •   రామప్ప నుండి గణప సముద్రానికి నీటిని తరలించాలి   •   జొన్న రైతుల డబ్బుల విషయంలో ఆందోళన వద్దు   •   రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో బంగారు, రజిత పథకాలు సాధించిన ఐపీఎస్‌ విద్యార్థులు   •   మాల్తుమ్మెద గ్రామంలో గడ్డి మందు పిచికారి   •   చలివాగు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి   •   భిక్కనూర్‌లో సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   రోడ్డు సౌకర్యంతో పాటు తాగునీరు అందించండి మహాప్రభో   •   జాతీయ జెండా ఎగురవేసిన బిజెపి నేతలు   •  

కొండాపూర్‌ గ్రామంలో చోరీ

11-08-2026 04:26 PM

మూడు తులాల బంగారం అపహరణ

గణపురం,(విజయక్రాంతి): గణపురం మండలంలోని కొండాపూర్‌ గ్రామంలో చోరీ జరిగింది. దానం సమ్మయ్య ఇంట్లోకి గుర్తుతెలియని దుండగుడు చొరబడి సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గణపురం ఎస్ఐ బొరగల అశోక్  సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.