ధర్మరెడ్డి ప్రాథమిక పాఠశాలకు పెయింటింగ్ బకెట్లు అందజేత
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో చేపట్టినటువంటి మరమత్తులు పనుల్లో భాగంగా నాగిరెడ్డిపేట్ మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి తనవంతు సహాయం పాఠశాలకు 28000 విలువ గల పెయింటింగ్ బకెట్లను గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి మాట్లాడుతూ... బడిని బాగు చేయడం అంటే గుడిని బాగు చేయడమే సమానంగా భావించి పెయింటింగ్ బకెట్లు అందజేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... పాఠశాల అభివృద్ధి కొరకు పెయింటింగ్ బకెట్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ,మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి, వార్డు మెంబర్లు లాలు, నారాయణ, గణేష్, మండల యువ మోర్చా అధ్యక్షులు రాజు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు మల్లేశం, బిజెపి నాయకులు గణేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.






