1 July, 2026 | 9:19 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

వేసవిలో కరెంట్ సమస్యలు ఉండవు

21-03-2026 12:06 AM

ఎల్బీనగర్, మార్చి 20 : వేసవిలో సౌత్రేన్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సరూర్ నగర్ ఆపరేషన్ డివిజనల్ పరిధిలో కరెంట్ సమస్యలు ఉండవని డివిజనల్ డిప్యూటీ ఇంజినీర్ ఫర్హాత్ అలీ తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం కొత్తగా 11, 32కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ పరిధిలో ప్రజలకు ఎటువంటి విద్యుత్ అంతరాయాలు కలుగకుండా ఉండటానికి  33/11కేవీ మోహన్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో నూతనంగా సత్యానగర్ లో 11కేవీ ఫీడర్ సబ్ స్టేషన్ ప్రారంభించారు.

11కేవీ ఫీడర్ లైన్‌లో ఉన్న సత్యానగర్, న్యూ మారుతీ నగర్ కాలనీ, జన ప్రియ అపార్ట్మెంట్, వినాయక్ నగర్ కాలనీలో నిరంతర కరెంట్ సరఫరా ఉంటుందని డీఈ ఫర్హాత్ అలీ తెలిపారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ ఆపరేషన్ డివిజనల్ అధికారులు, ఏఈలు, ఏఏఈలు, లైన్ మన్లు తదితరులు పాల్గొన్నారు.