17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

భూముల సర్వేలో పొరపాట్లకు తావుండొద్దు

14-04-2026 12:14 AM

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ 

ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపురం భూముల సర్వేలో ఏర్పాటు చేసే జియో కోఆర్డినేషన్ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మల్లంపల్లి మండలం రామచంద్రపురం గ్రామ శివారులోని రాజేశ్వరరావు పల్లె లో జరుగుతున్న సర్వేను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సర్వే నిర్వహిస్తున్న తీరును, డేటా ఎంట్రీ, జియో కోఆర్డినేషన్ ఏర్పాటు పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామచంద్రపురం భూముల సర్వే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతో నిర్వహిస్తుందని, జియో కోఆర్డినేషన్ ఏర్పాటు, సర్వే నిర్వహించడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, తహసిల్దార్ విజయభాస్కర్ సంబధిత అధికారులు పాల్గొన్నారు.