భక్తి ఉంటేనే శక్తి ఉంటుంది..
- ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్
- కొత్తపేట మైసమ్మకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ
ఎల్బీనగర్, ఆగస్టు 9 : భక్తి ఉంటేనే.. అక్కడ శక్తి ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి తది తరులు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురంలోని మైసమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న అమ్మవారికి ప్రభుత్వ సలహాదారు, బా న్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రా లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించా రు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకు డు దేప భాస్కర్ రెడ్డి, నాయకులు, కార్యకర్త లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది అని అన్నారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాలు అమ్మవారి దయేనని, బోనాల అనంతరం అమ్మవారిని వర్షాల కోసం ప్రార్థించగా భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నా రు. బోనాల పండుగ మన సనాతన సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక అని, లో కకల్యాణం, లోకశాంతి కలగాలని, సకాలం లో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగ, దేవాలయాల పూజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సతీమణి జమున, మాజీ కార్పొరేటర్లు నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సిం హా రెడ్డి, రంగా నర్సింహగుప్తా, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, లచ్చిరెడ్డి, పవన్ కుమార్, అరుణ, రేణుక తదితరులు పాల్గొన్నారు.






